close

తాజా వార్తలు

Updated : 30/01/2021 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సకాలంలో పోలవరం పూర్తి చేయాల్సిందే: జగన్‌

అమరావతి: పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాల్సిందేనని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. తొలివిడత ప్రాధాన్యతా ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. నిర్ణీత లక్ష్యంలోగా ప్రాజెక్టులు పూర్తవ్వాలని ఆదేశించారు. కాఫర్ డ్యాం వల్ల ముంపునకు గురికాకుండా చూడాలని.. సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నిర్ణీత ప్రణాళిక మేరకు ఆర్అండ్‌ఆర్‌ పనులను చేపట్టాలని చెప్పారు. 

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపైనా జగన్ సమీక్షించారు. ఈ ఏడాది జూన్‌ నాటికి వంశధార-నాగావళి అనుసంధాన పనులు, జులై నాటికి వంశధార పెండింగ్‌ పనులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. వీటితోపాటు రెండో విడత ప్రాధాన్యతా ప్రాజెక్టుల కార్యాచరణ సిద్ధం చేయాలని.. అందులో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమ, పల్నాడు ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థలతో అంగీకారం కుదిరిందని.. మిగిలిన ప్రాజెక్టుల నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

కర్నూలు నుంచి ఇండిగో విమాన సర్వీసులు

ఏకగ్రీవ ఒత్తిళ్లపై ‘షాడో’ నిఘా: నిమ్మగడ్డ




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని