అతి విశ్వాసం పనికిరాదు: జగన్‌
close

తాజా వార్తలు

Published : 19/03/2021 18:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అతి విశ్వాసం పనికిరాదు: జగన్‌

తిరుపతి ఉపఎన్నికపై మంత్రులతో సీఎం సమీక్ష

అమరావతి: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక విషయంలో అతి విశ్వాసం పనికిరాదని.. అందరూ సమన్వయం చేసుకుంటూ ఎంపీ అభ్యర్థి డా. గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలని వైకాపా అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అందుకు తగ్గట్టుగా నేతలు కష్టపడి పనిచేయాలని సూచించారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఒక మంత్రి, అదనంగా ఒక ఎమ్మెల్యే  ఉంటారని వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్, ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్‌ సమీక్షించారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి డా. గురుమూర్తిని నేతలకు సీఎం పరిచయం చేయించారు.

దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని, ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సీఎం సూచించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే విషయాన్ని గడపగడపకూ వెళ్లి వివరించాలని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇదే స్థాయి అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించనున్నట్లు ప్రజలకు చెప్పాలన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని