
తాజా వార్తలు
సీఎం జగన్ అత్యవసర సమీక్ష
అమరావతి: పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో సీఎం జగన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైకాపా ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఎన్నికలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినందున ప్రభుత్వం తరఫున అనుసరించాల్సిన వైఖరి, కోర్టు చెప్పిన అభిప్రాయాల తీరుపై చర్చించారు. ఎస్ఈసీకి సహకరించే అంశంపై ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు.
ఇవీ చదవండి..
ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
Tags :