
తాజా వార్తలు
రేపు దిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్
అమరావతి: ఏపీ సీఎం జగన్ రేపు దిల్లీ వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని కేంద్రాన్ని జగన్ కోరనున్నారు. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. దీనితో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా అమిత్‌షా సహా కేంద్రమంత్రులతో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
Tags :