తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా: జగన్
close

తాజా వార్తలు

Updated : 11/04/2021 05:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా: జగన్

అమరావతి: తిరుపతి ఎన్నికల ప్రచార సభ రద్దు చేసుకుంటున్నట్లు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా తిరుపతి పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు తిరుపతి ఓటర్లకు సీఎం మరో లేఖ రాశారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరి పర్యటన రద్దు చేసినట్లు వెల్లడించారు.

‘‘ఈ నెల 14న బహిరంగ సభకు వచ్చి తిరుపతి, నెల్లూరు ప్రజల ఆత్మీయత, అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని అనుకున్నాను. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే సభ రద్దు చేయడమే మేలు అనిపించింది. అందులోనూ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 11 మంది మరణించగా.. వారిలో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వారు ఉన్నారు. నేను సభ నిర్వహిస్తే అభిమానం, ఆప్యాయతతో వేలాదిగా తరలివస్తారు. అయితే మీ అందరి ఆరోగ్యం, కుటుంబాల శ్రేయస్సు నాకు మొదటి ప్రాధాన్యత. అందుకే బాధ్యత గల రాష్ట్ర ముఖ్యమంత్రిగా సభను రద్దు చేసుకుంటున్నాను.

నేను వ్యక్తిగతంగా సభకు హాజరై మిమ్మల్ని ఓటు అడగలేకపోయినా.. మన ప్రభుత్వం మీకోసం ఏం చేసిందో మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. వైకాపా పాలనలో మీకు కలిగిన లబ్ధిని వివరిస్తూ ఇంటింటికీ అందేలా ఉత్తరం రాశాను. 22 నెలల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికీ అందాయని భావిస్తున్నాను. మంచి చేస్తున్న ప్రభుత్వానికి ఓటు రూపంలో మీ దీవెనలు ఇస్తారని.. మన అభ్యర్థి డా. గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను’’ అని లేఖలో పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని