KCR: నన్నే మాస్క్ తీయమన్నాడు.. నవ్వులే నవ్వులు
close

తాజా వార్తలు

Updated : 20/06/2021 19:16 IST

KCR: నన్నే మాస్క్ తీయమన్నాడు.. నవ్వులే నవ్వులు

సిద్దిపేట: ప్రతి సభను, సమావేశాన్నీ తమదైన పంచ్‌లతో ఆద్యంతం రక్తికట్టించే అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకరు. కేసీఆర్‌ మాట్లాడటం మొదలు పెడితే మాటల ప్రవాహం ఆగదు. ఆయన విసిరే ఛలోక్తులకు నవ్వని వారు ఉండరు. ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మధ్య మధ్యలో తనదైన చమక్కులు విసిరారు. ప్రస్తుతం ఆయన మాటలు సామాజిక మాధ్యమాల్లో నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. ఒక పెళ్లికి వెళ్తే, తననే మాస్క్‌ తీయమన్నారంటూ కేసీఆర్‌ చెప్పడం నవ్వులు పూయిస్తోంది.

‘‘నేనో పెండ్లికి పోయిన. పెండ్లికి పోతే ఆ పెండ్లి పిల్లగాడు ‘సార్ మాస్క్ తీయ్’ అన్నడు. ‘ఎందుకయ్య’ అంటే ‘సార్ నువ్వు మళ్ల దొరుకతవో లేదో ఓ ఫొటో తీసుకుంటా’ అన్నడు. ‘నేను నీకు దొరుకతనో లేదో గానీ కరోనాకు దొరకుతా’ గదరా బై అన్న. ఆఖరికి వాడుగుంజా వీడు గుంజా నాక్కూడా వచ్చింది కరోనా..’’ అంటూ పెళ్లి సందర్భంగా తనకెదురైన అనుభవాన్ని సమావేశంలో పంచుకోగా, మంత్రి హరీశ్‌రావు సహా సభలోని వారంతా నవ్వాపుకోలేకపోయారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని