
తాజా వార్తలు
ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
కాళేశ్వరం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఇక్కడికి చేరుకున్న సీఎం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం కన్నేపల్లి పంపుహౌజును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించి గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటిదైన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. సీఎం పర్యటనలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ అనంతరం ప్రాజెక్టులో మొదటిదైన లక్ష్మీ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో విహంగ వీక్షణం ద్వారా మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం పరిశీలించారు. పర్యటనలో భాగంగా నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి సీఎం భోజనం చేయనున్నారు. భోజనం అనంతరం లక్ష్మీ బ్యారేజ్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత ఇంజినీర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తారు.
ఇవీ చదవండి..
రోజుకు లక్ష డోసులు!
సింగరేణి ఉద్యోగులకు నివాస గృహాలు