యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 21/04/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ నెల 19న సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీటీ స్కాన్‌, ఇతర పరీక్షల కోసం సీఎం యశోద ఆస్పత్రికి వచ్చారు. అంతకుముందు ఆయనకు వ్యవసాయ క్షేత్రంలోనే కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయితే వైరస్‌ తీవ్రతను తెలుసుకునేందుకు సీటీ స్కాన్‌ సహా ఇతర పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆయన యశోద ఆస్పత్రికి వచ్చారు. ప్రభుత్వ, పార్టీ వర్గాల సమాచారం మేరకు సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం పూర్తి స్థాయిలో నిలకడగా ఉందని తెలుస్తోంది.

ఈ నెల 19న యాంటీజెన్‌ పరీక్ష చేయించుకోగా సీఎంకు స్వల్పంగా కొవిడ్‌ లక్షణాలున్నట్లు తేలింది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష సైతం నిర్వహించగా.. అందులోనూ పాజిటివ్‌గా తేలింది. అప్పటినుంచి వైద్యుల సలహా మేరకు ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

సీఎం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు: డాక్టర్‌ ఎంవీరావు

‘‘సీఎం కేసీఆర్‌కు సాధారణ పరీక్షలు నిర్వహించాం. సీటీ స్కానింగ్‌ చేశాం. అంతా సాధారణంగానే ఉంది. ఆయనకు కొవిడ్‌ లక్షణాలు పోయాయి. కేసీఆర్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆక్సిజన్‌ లెవెల్స్‌ బాగానే ఉన్నాయి’’ అని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు.

యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షల ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ నేరుగా వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని