Corona: సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం
close

తాజా వార్తలు

Published : 10/05/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2,3 నెలల కాలానికి తాత్కాలిక ప్రాదిపదికన వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు.   రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై భేటీలో చర్చించారు.  వైద్య సిబ్బందికి గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వాలని అన్నారు.  భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వారికి వెయిటేజీ ఇవ్వాలన్నారు. ‘‘ కష్టకాలంలో ప్రజలకు సేవ చేసేందుకు యువ వైద్యులు ముందుకు రావాలి. వైద్యారోగ్యశాఖ సిబ్బంది పని ఒత్తిడి తగ్గించాలి. దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్‌ పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారు.ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి’’ అని కేసీఆర్‌ అన్నారు.

వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తక్షణమే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రారంభించాలని కేసీఆర్‌ ఆదేశించారు. వాటిల్లో సిబ్బందిని కూడా తక్షణం నియమించుకోవాలన్నారు.దీనికి సంబంధించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు, ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు మరింత అందుబాటులోకి తేవాలని కేసీఆర్‌ ఆదేశించారు. 

కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వారిని గుర్తించి టీకాలు వేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, వీధి వ్యాపారులు, కార్మికులను గుర్తించి వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నారు. అనంతరం కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో సీఎం కేసీఆర్‌ ఫోన్లో మాట్లాడారు. కరోనా నియంత్రణకు కొన్ని సూచనలు చేశారు. కేసీఆర్‌ సూచనలపై హర్షవర్ధన్‌ సానుకూలంగా స్పందించారు. ప్రధానితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రధానికి ఫోన్‌ కాల్‌

సమీక్ష అనంతరం ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ ఫోన్లో మాట్లాడారు. కేసీఆర్‌ సూచనలు బాగున్నాయని, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తనకు వివరించారని మోదీ తెలిపారు. వాటిని ఆచరణలో పెడతామన్నారు. మంచి సూచలను చేసినందుకు కేసీఆర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఔషధాల సరఫరాను పెంచాలని సీఎం విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని