close
Array ( ) 1

తాజా వార్తలు

మధ్యాహ్నం కేసీఆర్‌ అత్యవసర సమీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో అత్యవసర, అత్యున్నత సమావేశం జరగనుంది. పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు, ప్రజలను చైతన్యం చేసే కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

కరోనా కట్టడి చర్యలు, పంటల కొనుగోళ్ల అంశమే ప్రధాన అజెండాగా సీఎం కేసీఆర్‌  ఇవాళ సాయంత్రం 5గంటలకు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 33 జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖల అధికారులు పాల్గొంటారు.  సంబంధిత శాఖల కార్యదర్శులు కూడా సమీక్షలో పాల్గొంటారు. కరోనా కట్టడికోసం తీసుకుంటున్న చర్యలను జిల్లాల వారీగా సమీక్షించడంతో పాటు లాక్‌డౌన్‌ వల్ల ఉత్పన్నమైన పరిస్థితులను సీఎం తెలుసుకుంటారు. నిత్యావసరాల లభ్యత, ధరలు తదితర అంశాలపై సమీక్షిస్తారు. పంటల కొనుగోళ్ల అంశంపై సీఎం ప్రధానంగా దృష్టి సారిస్తారు. 

 లాక్ డౌన్తో మార్కెట్లన్నింటినీ బంద్ చేసిన  ప్రభుత్వం... గ్రామాల్లోనే పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అక్కడ కూడా గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా పంటల కొనుగోళ్ల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ధాన్యం సేకరణ కోసం గతంలో 4028 కేంద్రాలు ఉండగా ఈ  సారి ఏకంగా 6700 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రతిపాదిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీ అంశంపై కూడా సీఎం కేసీఆర్ సమీక్షించి అవసరమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.