close

తాజా వార్తలు

Updated : 22/01/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీతారామప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు నాగార్జునసాగర్‌ ఆయకట్టును కూడా కలుపుకొని 10లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఓ వైపు గోదావరి, మరోవైపు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశామన్నారు. దుమ్ముగూడెం పాయింట్‌ వద్ద ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుందని.. దీని ద్వారా ఖమ్మం జిల్లాకు నీరు అందించవచ్చని చెప్పారు. 

దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తిపోసి అటు ఇల్లెందు.. ఇటు సత్తుపల్లి.. మరోవైపు పాలేరు రిజర్వాయర్‌కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాలని సీఎం సూచించారు. సత్తుపల్లి, ఇల్లెందు వైపు వెళ్లే కాల్వలకు సంబంధించిన మిగిలిన పనుల సర్వే వెంటనే పూర్తిచేసి టెండర్లు ఆహ్వానించాలన్నారు. కృష్ణా నది ద్వారా నీరు అందని సమయంలో గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా సాగర్ ఆయకట్టుకు నీరందించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించి పాలేరు రిజర్వాయర్ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్ కల్లా పూర్తి చేయాని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌, ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

ముగ్గురు ఎమ్మెల్యేల పద్ధతి మారాలి: కేటీఆర్‌

మెట్‌పల్లిలో తెరాస, భాజపా శ్రేణుల తోపులాట



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని