
తాజా వార్తలు
ఆలయాలకు యాదాద్రి ఆదర్శం కావాలి: కేసీఆర్
యాదాద్రి: తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన కొనసాగుతోంది. యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న రహదారి, ఆలయంలోని అద్దాల మండపాన్ని సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలని.. భక్తులకు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలని చెప్పారు. మూలవిరాట్టుకు జరిగే సేవలు దూరం నుంచి కూడా కనిపించాలన్నారు.
ఆలయం దేదీప్యమానంగా కనిపించేలా విద్యుద్దీపాలంకరణ ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. లిఫ్టుల ఏర్పాటు ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఆలయ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయని.. శివాలయం పుష్కరిణి స్నానఘట్టాల నిర్మాణాలు తుది దశకు చేరాయన్నారు.
ఇవీ చదవండి
Tags :