Lockdown:ప్రధాని ఆదేశాల కోసం చూస్తున్నాం! 
close

తాజా వార్తలు

Published : 05/05/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown:ప్రధాని ఆదేశాల కోసం చూస్తున్నాం! 

యడియూరప్ప వ్యాఖ్యలు

బెంగళూరు: కర్ణాటకలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గడంలేదు. నిన్న ఒక్కరోజే 44వేలకు పైగా కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది.  దీంతో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని సీఎం యడియూరప్ప యోచిస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ పెట్టాలా? వద్దా ? అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఆయన తెలిపారు. దేశ ప్రధానిగా మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము అమలు చేస్తామని తెలిపారు. ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. 

మరోవైపు, ఏప్రిల్‌ 27 రాత్రి నుంచి మే 12 వరకు కర్ణాటకలో పాక్షిక లాక్‌డౌన్‌ పేరుతో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దీనివల్ల కూడా కేసుల్లో తగ్గుదల కనిపించకపోవడంతో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. మంగళవారం 44,631 కొత్త కేసులు నమోదు కాగా.. వాటిలో దాదాపు 22వేలకు పైగా బెంగళూరు నగరంలోనే ఉన్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని