close

తాజా వార్తలు

Published : 22/04/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీ స్థాయిలో టెస్టులు చేయాలి: జవహర్‌రెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక కాంటాక్టు పరీక్షల సంఖ్యను తక్షణం పెంచాలని ఏపీ కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఛైర్మన్‌ జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రాథమిక కాంటాక్టు పరీక్షలను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్లతో ఆన్‌లైన్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ వేగంగా విస్తరిస్తోందని.. కరోనా నిర్ధారణకు ట్రూనాట్‌ టెస్టులు కూడా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

భారీ స్థాయిలో కొవిడ్‌ టెస్టులు చేపట్టాల్సిందేనని జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు తనిఖీలు చేపడితే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని అభిప్రాయపడ్డారు. ఆలస్యం చేయకుండా కలెక్టర్లు రంగంలోకి దిగాలన్నారు. అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని.. కొవిడ్ కేర్‌ సెంటర్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రస్తుతం 19 వేల పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. మిగతా 19 వేల బెడ్లు కూడా అందుబాటుతోకి తీసుకురావాలన్నారు. 104 కాల్‌ సెంటర్‌ సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. 104కు వచ్చే కాల్స్‌ను సంబంధిత అధికారులకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని