భారీగా కేసులు.. కేరళలో పూర్తి Lockdown
close

తాజా వార్తలు

Published : 06/05/2021 20:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీగా కేసులు.. కేరళలో పూర్తి Lockdown

తిరువనంతపురం: కరోనా సెకండ్‌ వేవ్‌ కేరళను వణికిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నప్పటికీ అక్కడ వైరస్‌ ఉద్ధృతి ఆగడంలేదు. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వచ్చాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 42,464 కొత్త కేసులు రాగా.. 63మంది మృతిచెందారు. అలాగే, మరో 27,152మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ఉగ్రరూపం కొనసాగుతుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8న ఉదయం 6గంటల నుంచి 16వ తేదీ వరకు పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్టు సీఎం పినరయి విజయన్‌ ట్విటర్‌లో ప్రకటించారు. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సర్వీసులను అనుమతించనున్నారు. వైరస్‌ వ్యాప్తికి కళ్లెం వేసేందుకు ఇప్పటికే కఠిన లాక్‌డౌన్‌ తరహాలో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని