close

తాజా వార్తలు

Updated : 06/04/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒంటికాలుతోనే బెంగాల్‌లో గెలుస్తా: దీదీ

దిల్లీలోనూ అధికారంలోకి వస్తానన్న మమత

చుంచురా: ‘‘ఒక కాలికి దెబ్బతగిలితేనేం.. ఒంటికాలుతోనే బెంగాల్‌లో నెగ్గుతాం’’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తాను బెంగాల్‌ రాయల్‌ టైగర్‌ అని పేర్కొన్న దీదీ.. రాష్ట్రాన్ని పాలించేది స్థానికులేనని ఆమె స్పష్టం చేశారు. గుజరాత్‌ వ్యక్తులు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటూ భాజపాపై విమర్శలు గుప్పించారు. 

మమత నేడు చుంచురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘‘నేను ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే ఆనాడు నందిగ్రామ్‌లో నాపై దాడి జరిగింది. అందులో నా కాలికి గాయమైంది. అయితేనేం ఒంటికాలితోనే బెంగాల్‌లో విజయం సాధిస్తా. ఆ తర్వాత రెండు కాళ్లతో దిల్లీ(కేంద్రం)లోనూ అధికారంలో వస్తా’’ అని దీదీ ఉద్ఘాటించారు. 
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టేందుకు భాజపాకు రాష్ట్రంలో సరైన అభ్యర్థులు లేరని, అందుకే సిట్టింగ్‌ ఎంపీలను బరిలోకి దించారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ గురించి స్పందిస్తూ.. బెంగాల్‌ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిన భాజపా..  సరిగా పాలించట్లేదని దుయ్యబట్టారు. 

చుంచురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున లాకెట్‌ ఛటర్జీ బరిలోకి దిగారు. ఆమె హూగ్లీ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. బెంగాల్‌లో మొత్తం 294 నియోజకవర్గాలకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 60 నియోజకవర్గాలకు తొలి రెండు దశల్లో పోలింగ్‌ పూర్తవగా.. మూడో విడతలో మరో 31 స్థానాల్లో ఓటింగ్‌ జరగనుంది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని