TS: మినీ పోరుకు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలు
close

తాజా వార్తలు

Published : 18/04/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: మినీ పోరుకు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలు

హైదరాబాద్‌: తెలంగాణలో వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎన్నికల కమిటీలను ప్రకటించింది. వరంగల్‌ నగరపాలక సంస్థకు 13మందితో, ఖమ్మం నగరపాలక సంస్థకు 11మంది సభ్యులతో కూడిన కమిటీలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నియమించారు. వరంగల్‌ కమిటీలో కన్వీనర్‌గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కో-కన్వీనర్‌గా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వ్యవహరించనున్నారు. ఖమ్మం నగర పాలక సంస్థ కమిటీ కన్వీనర్‌గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, సభ్యులుగా భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, మాజీ కేంద్ర మంత్రులు రేణుకా చౌదరి, బలరామ్‌ నాయక్‌ తదితరులను నియమించారు. వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలకు; సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలకు 30న పోలింగ్‌ జరుగుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని