ప్రజల ఆరోగ్యాన్ని తెరాస పణంగా పెట్టింది..
close

తాజా వార్తలు

Updated : 14/04/2021 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజల ఆరోగ్యాన్ని తెరాస పణంగా పెట్టింది..

కేసీఆర్‌ సభపై కాంగ్రెస్‌ నేతల విమర్శలు

నల్గొండ : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల ఆరోగ్యాన్ని తెరాస పణంగా పెట్టిందని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. నల్గొండలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనుములలో కేసీఆర్‌ బహిరంగా సభ బాధ్యతారాహత్యమని మండిపడ్డారు. సాగర్‌ ప్రజలు తెరాసకు కచ్చితంగా గుణపాఠం చెబుతారని అన్నారు. ఉప ఎన్నికలో జానారెడ్డి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ జయంతి రోజే దళితులను తెరాస అవమానపరిచిన విషయం సాగర్‌ నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు. తెరాస పాలనలో ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గానికి కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ సమావేశానికి డబ్బులు ఇచ్చి ప్రజలను తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ సభకు ప్రజలు వచ్చి కరోనా అంటించుకోవాలా? అని ప్రశ్నించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని