
తాజా వార్తలు
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో .. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఇవే..
► విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు మెట్రో, ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం.
► ప్రైవేటు విద్యాసంస్థల ఫీజల నియంత్రణకు చర్యలు
► ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచుతాం.
► అర్హత కలిగిన వారందరికీ రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇస్తాం.
► సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షల ఆర్థిక సాయం.
► వరదల నివారణకు అత్యున్నత విధానం తీసుకొస్తాం.
► ఉచిత ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అమలు చేస్తాం
► నిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తాం.
► ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తాం.
► మురికివాడల అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేస్తాం.
► సఫాయి కర్మచారీలు, వారి కుటుంబాలకు రూ.20లక్షల బీమా సదుపాయం.
► కేబుల్ టీవీ ఆపరేటర్లకు స్తంభాల ఫీజు మాఫీ
► కొవిడ్ వల్ల దెబ్బతిన్న రంగాలకు నిరుద్యోగ అలవెన్స్‌లు
► అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్య పెంచుతాం.
► సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లకు పన్ను మినహాయింపు.
► మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టికెట్ల ధరల నియంత్రణ
► వీధి వ్యాపారులకు ఆరోగ్య, ప్రమాద బీమా