ఆ పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదు: ఉత్తమ్‌
close

తాజా వార్తలు

Updated : 18/02/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదు: ఉత్తమ్‌

నల్గొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే అర్హత లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ నేత రాములునాయక్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం పార్టీ నేతలు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీహెచ్‌తో కలిసి ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాములునాయక్‌ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం తోడ్పాటు అందించలేదని విమర్శించారు. పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు రావాల్సిన హక్కులు, హామీలను సాధించే విషయంలో రాష్ట్రంలోని భాజపా నేతలు ఎలాంటి కృషి చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగ యువతను, వేతన సవరణ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులను తెరాస సర్కార్‌ మోసం చేస్తోందని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని