సీఎంకేనా మెరుగైన వైద్యం?: జీవన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Published : 23/04/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎంకేనా మెరుగైన వైద్యం?: జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రజలకు విద్య, వైద్యం అనేవి రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు. మీడియాతో గురువారం జీవన్‌రెడ్డి మాట్లాడారు. కొవిడ్‌ రోగులకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయని ఆరోపించారు. కరోనా నియంత్రణకు వాడే మందుల కొరత ఏర్పడిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్‌ ఉప ఎన్నిక సభతో వేలాదిమందికి కరోనా సోకిందని, అక్కడ కరోనా నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ఈ పరిణామాలకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలన్నారు.

‘‘ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్‌ను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదు. కరోనాపై ఇప్పటివరకు ముఖ్యమంత్రి కనీసం సమీక్ష కూడా చేయలేదు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటలది వేదాంత ధోరణి. మెడికల్‌ డైరెక్టర్‌ ఒక సమాచారం చెబితే ఈటల మరో రకమైన సమాచారం ఇస్తారు. సీఎంకు అందుతున్న మెరుగైన వైద్యం సామాన్యులకు అందదా? ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూళ్లను ప్రభుత్వం నియంత్రించాలి. కరోనా బారిన పడ్డ పేదలకు పూర్తి స్థాయి బిల్లులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి చెల్లించాలి. ఆక్సిజన్‌ కొరత లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని జీవన్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని