close

తాజా వార్తలు

Updated : 19/01/2021 14:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాంగ్రెస్‌ రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం

హైదరాబాద్‌: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాజ్‌భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.లుంబినీ పార్క్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు ప్రదర్శనగా వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్‌ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవన్న పోలీసులు లుంబినీ పార్క్‌ వద్ద పలువురు నేతలను అరెస్టు చేశారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట కూడలి, రాజ్‌భవన్‌వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా  మారింది.

ఇవీ చదవండి...
ట్యాంక్‌బండ్‌పై రియల్‌ హీరో

మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు 




Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని