బెంగాల్‌లో కాంగ్రెస్‌ VS కాంగ్రెస్‌
close

తాజా వార్తలు

Published : 02/03/2021 15:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాల్‌లో కాంగ్రెస్‌ VS కాంగ్రెస్‌

ISFతో పొత్తుపై ఆనంద్‌ శర్మ.. అధిర్‌ రంజన్‌ ట్వీట్‌ ఫైర్‌

దిల్లీ: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో  పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, ప్రచారాలతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ క్రమంలోనే ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌తో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే ఈ నిర్ణయం పార్టీలో మరోసారి విభేదాలకు తెరలేపింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జి-23 నేతల్లో ఒకరైన ఆనంద్‌శర్మ బెంగాల్‌లో పార్టీ పొత్తును బహిరంగంగా తప్పుబట్టారు. దీంతో పార్టీ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురీ.. ఆనంద్‌ తీరుపై వరుస ట్వీట్లలో మండిపడ్డారు. అసలేం జరిగిందంటే..

బెంగాల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌-వామపక్ష కూటమిలో ముస్లిం మతపెద్ద అబ్బాస్‌ సిద్ధిఖీ నేతృత్వంలోని ‘ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌(ఐఎస్‌ఎఫ్‌) భాగస్వామిగా చేరింది. అయితే ఐఎస్‌ఎఫ్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌ శర్మ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పార్టీ సిద్ధాంతాలకు, గాంధీ, నెహ్రూలు చెప్పిన లౌకికవాదానికి విరుద్ధమంటూ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. 

ఈ వ్యాఖ్యలను ఖండించిన అధిర్‌ రంజన్‌ చౌధురీ నేడు వరుస ట్వీట్లలో ఆనంద్‌ శర్మను విమర్శించారు. ముందు నిజాలు తెలుసుకోండి అంటూ ఎద్దేవా చేశారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ కూటమికి నాయకత్వం వహిస్తోంది. కాంగ్రెస్‌ ఇందులో అంతర్భాగంగా ఉంది. భాజపా విభజన రాజకీయాలను, నియంతృత పాలనను ఓడించేందుకు మేమంతా కట్టుబడి ఉన్నాం. అంతేగాక, కూటమిలో కాంగ్రెస్‌ సీటు షేరు ఏ మాత్రం తగ్గలేదు. లెఫ్ట్‌ఫ్రంట్‌ తమ వాటాలోని కొన్ని సీట్లను ఐఎస్‌ఎఫ్‌కు పంచుతోంది. భాజపాకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకునేవారు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొనాలి. అంతేగానీ, భాజపా ఎజెండాలతో పార్టీని తక్కువ చేసేందుకు ప్రయత్నించకూడదు. ఇకనైనా ప్రధానమంత్రిని పొగుడుతూ సమయాన్ని వృథా చేసుకోవడం ఆపి.. వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా పార్టీకోసం పనిచేయాలని ఆ బృందాన్ని (జి23 నేతలను ఉద్దేశిస్తూ) కోరుతున్నా. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. పోషించే చెట్టునే అణచడం సరికాదు’’ అని అధిర్‌ రంజన్‌ హితవు పలికారు. 

పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కొందరు కాంగ్రెస్‌ నేతలు తాజాగా ఇటీవల దూకుడు పెంచిన విషయం తెలిసిందే. గత నెల 27 జమ్మూలో సమావేశమైన జి23 నేతలు హైకమాండ్‌ తీరుపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్‌.. ప్రధానిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని