‘నా నొప్పి కంటే ప్రజల బాధ పెద్దది’
close

తాజా వార్తలు

Published : 16/03/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నా నొప్పి కంటే ప్రజల బాధ పెద్దది’

ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ

కోల్‌కతా: కాలి గాయం బాధపెడుతున్నా చక్రాల కుర్చీలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ. సోమవారం ఆమె కోల్‌కతాకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురూలియాకు వెళ్లారు. తన గాయం నొప్పి కంటే ప్రజల బాధ పెద్దదని, అదే తనను ఇక్కడిదాకా రప్పించిందని దీదీ అన్నారు.

‘‘నందిగ్రామ్‌లో జరిగిన ఘటనలో నా కాలికి గాయమైంది. అయితే అదృష్టవశాత్తూ ఆ దాడి నుంచి నేను ప్రాణాలతో బయటపడ్డాను. గాయం తర్వాత నేను ఇంటికే పరిమితమవుతానని కొందరు(ప్రత్యర్థులను ఉద్దేశిస్తూ) భావించారు. కానీ, నా నొప్పి కంటే ప్రజల బాధ పెద్దది. అందుకే ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నా’’ అని మమత చెప్పారు.  

ఈ సందర్భంగా కాంగ్రెస్‌, భాజపాపై విమర్శల వర్షం కురిపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అబద్ధాలతో భాజపా పురూలియాలో గెలిచిందని ఆరోపించారు. ఇంధనం, గ్యాస్‌ ధరల పెరుగుదలకు కాషాయ పార్టీనే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ఓ చలనం లేని పెద్ద బండ లాంటిదని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీలను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టాలని చెప్పారు. 10 ఏళ్ల అధికారంలో తాము సాధించిన అభివృద్ధి.. ప్రపంచంలోనే ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు. ‘ఖేలా హెబో’ అంటూ సీఎం నినాదాలు చేశారు. నందిగ్రామ్‌ ఘటన తర్వాత దీదీ పాల్గొన తొలి ఎన్నికల ర్యాలీ ఇది.

మరో ఎమ్మెల్యే రాజీనామా..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని మరో ఎమ్మెల్యే వీడారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దేవశ్రీ రాయ్‌ సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో రాయ్‌కు టికెట్‌ కేటాయించకపోవడంతో అసంతృప్తికి గురైన ఆమె పార్టీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. దేవశ్రీ కూడా భాజపాలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని