పెళ్లైన 4 నెలలకే కానిస్టేబుల్‌ బలవన్మరణం
close

తాజా వార్తలు

Updated : 30/03/2021 11:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లైన 4 నెలలకే కానిస్టేబుల్‌ బలవన్మరణం

యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల శివారులో కానిస్టేబుల్‌ మల్లికార్జున సైదులు(25) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తిరుమలేశుని గుట్ట సమీపంలోని ఓ వెంచర్‌లో చెట్టుకు కానిస్టేబుల్‌ ఉరి వేసుకున్నాడు. నల్గొండ జిల్లా దిండి మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన సైదులు మర్రిగూడెం పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి గత ఏడాది నవంబర్‌లో వివాహమైంది. అప్పటి నుంచి దంపతులు మర్రిగూడెంలోనే నివాసం ఉంటున్నారు. భార్యభర్తల మధ్య తరచూ చిన్నపాటి గొడవలు చోటు చేసుకునేవని సమాచారం. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన సైదులు భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు.

అక్కడి నుంచి నేరుగా తిరుమలేశుని గుట్ట సమీపానికి వెళ్లిన సైదులు అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న యాచారం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ లింగయ్య తెలిపారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని