close

తాజా వార్తలు

Updated : 17/01/2021 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో కొత్తగా 299 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 33,298 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 299 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,91,666కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,577కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 379 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,85,898కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,191 ఉండగా వీరిలో 2,395 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 74,61,687కి చేరింది.

ఇవీ చదవండి..

మొదటి వరసలో ఆ ఇద్దరూ!

తొలి డోసుతోనే రక్షణ లభించదు




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని