close

తాజా వార్తలు

Updated : 21/01/2021 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో కొత్తగా 226  కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 226 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,92,621కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న  కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,584కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 224 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,87,117కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,920 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 2,322 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 39 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.


 

ఇవీ చదవండి..

కొవిడ్‌ టీకా అలజడి

విదేశాల్లో ఎక్కడైనా మెడిసిన్‌ చదవొచ్చు
 



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని