మూడు రోజుల వ్యవధిలో తల్లీకొడుకు మృతి
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడు రోజుల వ్యవధిలో తల్లీకొడుకు మృతి

ఆకివీడు(పశ్చిమగోదావరి), న్యూస్‌టుడే: కార్మిక సంఘం నాయకులుగా సేవలందించిన తల్లీ కొడుకులు మూడు రోజుల వ్యవధిలోనే కరోనాతో పోరాడి మృతి చెందారు. వివరాలు ఇలా.. ఆకివీడుకు చెందిన సీఐటీయూ నాయకుడు మారుబోయిన లెనిన్‌ బాబు(51) కొవిడ్‌ లక్షణాలతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన తల్లి సావిత్రమ్మ (80) హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆమె సీఐటీయూ నాయకురాలిగా, ఐద్వా జిల్లా అధ్యక్షురాలిగా పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. లెనిన్‌బాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం హైదరాబాద్‌లో హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని సీపీఎం సీనియర్‌ నాయకుడు బి.సత్యనారాయణ, సన్నిహితులు తెలిపారు. సావిత్రమ్మ మృతికి సీపీఎం, ఐద్వా, సీఐటీయూ, పలు ప్రజాసంఘాల నాయకులు సంతాపం తెలిపారు.

వారం వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు బలి

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ విజృంభణతో వారం వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఒకే సారి కుటుంబ పెద్దలను కోల్పోవడంతో వారి కుటుంబాలతో పాటు గ్రామంలో  విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటన పాలకొల్లు మండలం వడ్లవానిపాలెం గొల్లవాని చెరువులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోళ్ల సుబ్బలక్ష్మి (85) కరోనాతో గత నెల 29న ఇంట్లోనే మృతి చెందారు. ఆమె చిన్న కుమారుడు సత్యప్రసాద్‌ (63) కరోనా సోకడంతో గత నెల 28న భీమవరం ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈనెల 2న మృతి చెందారు. అతని భార్య లక్ష్మీ ప్రసూన(54) పాలకొల్లు ప్రైవేటు ఆసుపత్రిలో గత నెల 28న చేరారు. చికిత్స పొందుతూ బుధవారం తనువు చాలించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు చేశారు. పెద్ద కుమార్తె లండన్‌లో, చిన్న కుమార్తె అనూష కుటుంబం తణుకులో నివాసం ఉంటున్నారు.

అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు

దెందులూరు, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి ఏడాది వ్యవధిలో ఓ కుటుంబంలో తండ్రీకుమారులను బలి తీసుకుంది. దెందులూరుకు చెందిన యువకుడు (37) కర్ణాటకలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కరోనా బారిన పడిన ఇతను ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. ఇతని తండ్రి గతేడాది కరోనాతో మృతి చెందారు. బీ నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో పనిచేస్తున్న దెందులూరుకు చెందిన మరో యువకుడు(37)  కరోనాతో చికిత్స పొందుతూ ఏలూరు ఆసుపత్రిలో బుధవారం మృతి చెందారు. ఒకే రోజు ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని