కరోనా దెబ్బకు.. మహారాష్ట్ర గడగడ
close

తాజా వార్తలు

Published : 11/04/2021 22:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా దెబ్బకు.. మహారాష్ట్ర గడగడ

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 60 వేల మార్కును దాటేసింది. గడిచిన 24 గంటల్లో  63,294 మందికి కొవిడ్‌ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,07,245కి చేరింది. తాజాగా 349 మంది మహమ్మారికి బలవ్వగా ఇప్పటివరకు 57,987 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,65,587 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మాస్క్‌ ధరించని వారికి రూ.వెయ్యి  జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లోనూ, పని ప్రదేశాలు, రవాణా వాహనాల్లోనూ మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీసులు, ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

కర్ణాటకలోనూ అదే పరిస్థితి

మరోవైపు పొరుగురాష్ట్రం కర్ణాటకలోనూ కొవిడ్‌ ఉద్ధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా మరో 10,250 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,65,290కి చేరింది. కరోనా మహమ్మారి కారణంగా ఇవాళ ఒక్క రోజే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69,225 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది.

దిల్లీలో గరిష్ఠ స్థాయికి..

దేశ రాజధాని దిల్లీని కరోనా గడగడలాడిస్తోంది. గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,774 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,25,197కి చేరింది. దిల్లీలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు ఇదే గరిష్ఠం. తాజాగా కరోనా మహమ్మారితో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు 9.43గా నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని