close
Array ( ) 1

తాజా వార్తలు

IN PICS: కరోనా లాక్‌డౌన్‌ ఏడో రోజు

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలో ఇటీవల జరిగిన ప్రార్థనలకు హాజరై వచ్చినవారిలో పలువురికి కరోనా పాజిటివ్‌ ఉండడంతో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. దిల్లీకి వెళ్లినవారితో పాటు వారి కుటుంబ సభ్యులను గుర్తించి అనుమానితుల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. వారిని ఇంట్లోనే క్వారంటైన్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారితోపాటు మత ప్రార్థనలకు వెళ్లినవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. దేశంలో కరోనా విస్తరించకుండా లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాల్సిన సమయమిది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఏడో రోజు చిత్రాలు మీ కోసం.. 


హైదరాబాద్‌: సంతోష్‌నగర్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని కారును పోలీసులు తనిఖీ చేశారు. కారులో ఓ యువతి, మహిళ, వృద్ధురాలు, చిన్న పాప ఉన్నారు. కారు నడుపుతున్న యువతి వద్ద డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించగా వారందరూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు కారును స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


చెన్నైలో కాకులకు ఆహారంగా బిస్కెట్లు వేస్తున్న పోలీసు.


హైదరాబాద్‌: నారాయణగూడ మెల్కోటే పార్కులో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి బియ్యం, రూ.500 నగదు పంపిణీ చేశారు. వాటిని తీసుకొనేందుకు వరుసలో నిల్చున్న ప్రజలు ఎండ వేడిని తట్టుకోలేక వరుసలో చెప్పులు పెట్టి సమీపంలోని చెట్టు నీడకు చేరారు. ఓ మహిళ బియ్యం కోసం తీసుకొచ్చిన సంచిని ఎండ నుంచి రక్షణగా తలపై పెట్టుకొని వరుసలో కూర్చొంది.


దిల్లీ: లాక్‌డౌన్‌తో ఆకలితో బాధపడుతున్న వారికి రామకృష్ణ మిషన్‌ ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తుంది. తమ కుటుంబ సభ్యులకు ఆహార ప్యాకెట్లను తీసుకెళ్తున్న చిన్నారులు.


ముంబయి: లాక్‌డౌన్‌ కారణంగా చేసేందుకు పనిలేక లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ సమీపంలోని పైవంతెన కింద నిద్రిస్తున్న వలస కూలీలు.


బెంగళూరు: కరోనా వైరస్‌ రూపాన్ని పోలిన శిరస్త్రాణం ధరించి రోడ్డుపై తిరుగుతున్న వారిని ఆపుతున్న ట్రాఫిక్‌ పోలీసు.


ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ముగ్గురేసి ప్రయాణిస్తున్న దృశ్యం.


దిల్లీలోని ఓల్డ్‌ క్వార్టర్స్‌ ప్రాంతంలో లాక్‌డౌన్‌ నిబంధనలు విరుద్ధంగా వీధుల్లో తిరుగున్న వారికి శిక్ష విధించిన పోలీసులు.


లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో దేశీయ, విదేశీ విమాన సర్వీసులను నిలిపివేశారు. దీంతో చాలామంది విదేశీయులు ఇండియాలోనే ఉన్నారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌ వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాన్ని ఎక్కేందుకు బారులు తీరిన జర్మనీ, యూరప్‌ దేశాల ప్రయాణికులు.


గువాహటిలోని ఇండోర్‌ స్టేడియాన్ని తాత్కాలిక క్వారంటైన్‌ కేంద్రంగా మార్చాలని అసోం ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో స్టేడియంలో స్నానాల గదులు, బెడ్‌లను సిద్ధం చేస్తున్న సిబ్బంది


బిహార్‌ రాజధాని పట్నాలో ఎన్డీఆర్‌ఎఫ్‌ ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లోని ప్రజలకు అందించేందుకు ఆహార పొట్లాలను సిద్ధం చేస్తున్న వాలంటీర్లు.


గువాహటిలోని నవగ్రహ అలయ ఆవరణలో వానరాలకు బిస్కెట్లు వేస్తున్న అసోం పోలీసు అధికారి. లాక్‌డౌన్‌తో భక్తులు ఆలయానికి రావడం లేదు. ఆలయ పరిసరాల్లో వందలాది కోతులు భక్తులు అందించే ఆహారం, ప్రసాదాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కోతులు, ఆవులు, వీధి శునకాలకు ఆహారాన్ని అందించేందుకు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి.


 లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనాథలు, యాచకులకు ఏపీ ప్రభుత్వం శిబిరాలు ఏర్పాటు చేసింది. విశాఖ రైల్వే మైదానం సమీపంలో ఓ దివ్యాంగుడైన యాచకుడిని శిబిరానికి రావాల్సిందిగా మున్సిపల్‌ సిబ్బంది కోరారు. అందుకు అతడు నిరాకరించడంతో బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.