close
Array ( ) 1

తాజా వార్తలు

IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

అమరావతి: చిత్రంలోని దివ్యాంగుడి పేరు దేవరాజు. పోలియో కారణంగా చిన్నప్పటి నుంచే నడుము కింది భాగం పనిచేయడం మానేసింది. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా జీవించాలని సుమారు 20 ఏళ్ల క్రితమే బెంగళూరు నుంచి విజయవాడ వచ్చాడు. అయోధ్యనగర్‌ పండ్ల మార్కెట్‌ సమీపంలో పాన్‌షాప్‌ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. తాను సంపాదించిన సొమ్ముతో ద్విచక్ర వాహనం కొనుగోలు చేసి దానిపై మంచం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా పాన్‌షాపు మూతపడింది. జీవనోపాధి కోసం ఉదయం 11 గంటల వరకు పండ్లు అమ్ముతున్నాడు.


కష్టకాలంలో ఓ ఆలోచన తన కుటుంబాన్ని ఆకలి బాధ నుంచి రక్షించిందని సంతోషపడుతున్నాడు నిజామాబాద్‌కు చెందిన పాషా. రోడ్డు పక్కన బండిపై జ్యూస్‌ అమ్మే పాషా లాక్‌డౌన్‌ ప్రకటనతో ఇబ్బందుల్లో పడ్డాడు. ఓ వైపు రోడ్లపై జనాలు తిరగడం లేదు. మరో వైపు పోలీసులు జ్యూస్‌ నిత్యావసర వస్తువు కాదని బండిని పెట్టనివ్వలేదు. దీంతో జీవనోపాధికి ఏం చేయాలా అని ఆలోచించిన పాషా.. హోల్‌సేల్‌గా కోడిగుడ్లు కొనుగోలు చేసి తన బండిపై అమ్ముతున్నాడు. జనాలు వచ్చి కొనుగోలు చేస్తున్నారని, పోలీసులు సైతం గుడ్లు నిత్యావసర వస్తువుగా భావించి తనను ఏమీ అనడం లేదని పాషా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.


పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న మహిళా పోలీసుపై కరోనా వైరస్‌ నిర్మూలన రసాయనాన్ని పిచికారి చేస్తున్న వైద్య సిబ్బంది.


హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ చిలకలగూడలో గత పదిహేను రోజులుగా నల్లా నీరు రావడం లేదు. శుక్రవారం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్యాంకర్‌ వచ్చిన ఆనందంలో సామాజిక దూరం పాటించకుండా నీటిని పట్టుకుంటున్న మహిళలు.


లాక్‌డౌన్‌ సందర్భంగా వాహనదారులను పోలీసులు గుర్తింపు కార్డులు అడుగుతుండడంతో గుంటూరు అరండల్‌పేట వారధి వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.


లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా గుంటూరు లక్ష్మీపురం రహదారిలో ద్విచక్రవాహనంపై నలుగురు ప్రయాణిస్తున్న దృశ్యం.


ఖమ్మం శాంతినగర్‌లో క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కర్ణన్‌.


చిత్తూరు: బజారు వీధిలో ఓ దివ్యాంగుడు తన కుటుంబ పోషణకు అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గ్యాస్‌ సిలిండర్‌ను మూడు చక్రాల వాహనంపై తీసుకెళ్తూ కనిపించాడు. లాక్‌డౌన్‌తో నిత్యావసర వస్తువుల కోసం కిలోమీటర్ల కొద్ది ప్రయాణించాల్సి వస్తోందని వాపోయాడు.


అగర్తలా: లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా రిక్షా నడుపుతున్న వ్యక్తిని కొడుతున్న పోలీసు.


కరోనా వైరస్‌పై పోరులో భాగంగా వచ్చే ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు లైట్లు బంద్‌ చేసి టార్చ్‌, మొబైల్‌ లైట్‌లు, కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనికి స్పందనగా కోల్‌కతాలో ఓ దుకాణదారుడు కొవ్వొత్తులను అమ్మేందుకు సిద్ధం చేస్తున్నాడు.


శ్రీనగర్‌: బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లిరావడంతో క్వారంటైన్‌లో ఉన్న కశ్మీర్‌కు చెందిన వైద్య విద్యార్థులు శుక్రవారం వారి స్వస్థలాలకు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసు, ప్రభుత్వ సిబ్బంది చప్పట్లు కొట్టి అభినందించారు. 


కోల్‌కతాలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న ఆహారాన్ని చూస్తున్న ఓ చిన్నారి. తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు.


గువాహటిలోని గణేష్‌గురి ప్రాంతంలో రోడ్డుపై ప్రయాణిస్తున్నవారిని ఆపి మాస్క్‌లు ధరించాలని కోరుతున్న భద్రతా సిబ్బంది.


లాక్‌డౌన్‌ సందర్భంగా జనం గుంపులుగా తిరగడాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులు వీధుల్లో జన సమూహాలను గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.