తెలంగాణలో ఒక్కరోజే 62 కేసులు 
close

తాజా వార్తలు

Published : 06/04/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో ఒక్కరోజే 62 కేసులు 

హైదరాబద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 62 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 334కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, 33 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 289 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా తెలంగాణలోని 24జిల్లాలకు విస్తరించింది. హైదరాబాద్‌లో 145 మంది, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 23 మంది, నిజామాబాద్‌ జిల్లాలో 19 మంది, నల్గొండ జిల్లాలో 13 మంది మేడ్చల్‌ జిల్లాలో 12 మంది, కామారెడ్డిలో 8 మంది, ఆదిలాబాద్‌లో 10 మంది, సంగారెడ్డి జిల్లాలో ఏడుగురు, వికారాబాద్‌లో నలుగురు, సూర్యాపేటలో ఇద్దరు, ములుగు జిల్లాలో ఇద్దరు, జగిత్యాల, జనగామ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, జోగులాంబ గద్వాల, మెదక్‌ జిల్లాలో ఐదుగురు చొప్పున, మహబూబాబాద్‌ జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్‌ జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  

ఇక దేశ వ్యాప్తంగా 3577 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 274 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 83 మంది మృతి చెందారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని