close

తాజా వార్తలు

Updated : 01/04/2020 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 14 కేసులు

పశ్చిమగోదావరి: ఏపీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 14 మందికి కరోనా సోకింది. ఈ మేరకు జిల్లా వైద్యఆరోగ్య శాఖ నివేదికను ఆ జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు వాట్సాప్‌ ద్వారా వెల్లడించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా సోకిన బాధితుల సంఖ్య 58కి చేరింది. ఏలూరులో ఆరు, భీమవరంలో రెండు, పెనుగొండలో రెండు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 30 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్‌ తెలిపారు. వైద్యపరీక్షల్లో 14 పాజిటివ్‌, 10 నెగిటివ్‌, ఇంకా 6 నివేదికలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ కరోనా పాజిటివ్‌ కేసులను వైద్య ఆరోగ్యశాఖ ధ్రువీకరించాల్సిఉంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన