వరుడికి కరోనా.. ఆగిన పెళ్లి!
close

తాజా వార్తలు

Published : 23/07/2020 21:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుడికి కరోనా.. ఆగిన పెళ్లి!

కొత్తపేట: కరోనా రోగం పెళ్లింట కలకలం రేపింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో శుభకార్యాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఆనందంతో పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా కల్యాణ ఘడియలకు ఒక్క రోజు ముందు పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్‌ అని సంక్షిప్త సందేశం అందింది. దీంతో అతడిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించడంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కుమారుడికి జ్వరం రావడంతో అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఫలితం పాజిటివ్‌ రావడంతో పెళ్లి పనుల్లో పాలుపంచుకున్న వారంతా ఇప్పుడు భయాందోళనతో కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని