close

తాజా వార్తలు

Updated : 19/05/2020 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో మరో 57 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,739 మంది నమూనాలు పరీక్షించగా 57 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2339కి చేరింది.

గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 52కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 691 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కోలుకుని 1596 మంది కొవిడ్‌ బాధితులు డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన 57 కేసుల్లో ఆరుగురు కోయంబేడు కాంటాక్టు కేసులని అధికారులు వెల్లడించారు. కోయంబేడు కాంటాక్టు కొత్తకేసుల్లో చిత్తూరు జిల్లాలో 5, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు ఉన్నారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని