
తాజా వార్తలు
ఏపీలో మరో 47 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,136 మంది నమూనాలు పరీక్షించగా 47 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,561కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 5 కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నాయి. కోయంబేడు కేసుల్లో చిత్తూరు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో రెండు ఉన్నాయి.
కరోనా బారి నుంచి కోలుకుని ఇప్పటి వరకు మొత్తం 1,778 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 727 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 56కు చేరింది.
Tags :
జిల్లా వార్తలు