close

తాజా వార్తలు

Published : 29/11/2020 08:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 805 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,69,223కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,455కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 948 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,57,278కి చేరింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 131 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 82, రంగారెడ్డి జిల్లాలో 58 కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 10,490 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 8,367 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన