close

తాజా వార్తలు

Published : 11/07/2020 21:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో కరోనా: 33 వేలు దాటిన కేసులు

వెల్లడించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 1,178 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 736, రంగారెడ్డి 125, మేడ్చల్‌ 101 కేసులు .. ఇతర ప్రాంతాల్లో మిగిలిన కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,402కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 11,062 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ మరో 9 మంది ప్రాణాలు విడవగా.. మొత్తం ఇప్పటి వరకు కరోనాతో 348 మంది మృతి చెందారు. కరోనా నుంచి ఇవాళ 1,714 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 12, 125 మంది చికిత్స పొందుతుండగా.. 20, 919 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని