close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 16/03/2020 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా అప్‌డేట్స్‌: బాధితులు @ 114

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో కొత్తగా మరో నాలుగు కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో వైరస్‌ బాధితుల సంఖ్య 37కు చేరింది. వీరిలో ముగ్గురు ముంబయికి, మరొకరు నవీ ముంబయికి చెందినవారని అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఈ వైరస్‌ వ్యాప్తి చెందిన వారి సంఖ్య 114కి చేరింది.


మోదీ చిట్కాలు

కరోనా మహమ్మారిపై ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తిచేశారు. కరోనాపై వదంతులు ఎంతమాత్రం నమ్మొద్దని చెబుతున్నారు. అయితే వైరస్‌పై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పిన ప్రధాని.. చిన్న చిన్న చిట్కాలతో కరోనా వ్యాప్తిని అరికట్టొచ్చని సూచించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. (పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..)


50 మందికి మించకూడదు: కేజ్రీవాల్‌

దేశ రాజధానిలో వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆంక్షల్ని మరింత కట్టుదిట్టం చేశారు. మార్చి 31 వరకు 50 మందికంటే ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉన్న ఎలాంటి మత, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమావేశాలు నిర్వహించ కూడదని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు జిమ్‌లు, నైట్‌క్లబ్‌లు, స్పాలు మూసివేయాలని కోరారు. పెళ్లిళ్లపై ఎలాంటి నిషేధం లేకపోయినప్పటికీ.. తేదీల్ని మార్చుకోవడం మంచిదని సూచించారు. 


కర్ణాటక సీఎంపై విమర్శలు

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప తన ప్రభుత్వ ఆదేశాలను తానే ఉల్లంఘించారు. కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉందన్న కారణంతో సమూహాలుగా కలవడంపై నిషేధం విధించిన ప్రభుత్వం, పెళ్లిళ్లు సైతం వాయిదా వేసుకోవాలని సూచించింది. అయితే, భారీ ఎత్తున బెళగావిలో జరిగిన భాజపా ఎమ్మెల్సీ కుమార్తె వివాహానికి ఆయన హాజరవ్వడంపై విమర్శలు వెల్లువవెత్తుతున్నాయి. ఆయనతో పాటు మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కూడా ఆదివారం ఈ వివాహానికి హాజరవ్వడం గమనార్హం.


ఖర్చులు ప్రభుత్వానివే: నితీశ్‌

కరోనా వైరస్‌ సోకిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు. ఎవరైనా ఈ వైరస్‌ కారణంగా మరణిస్తే వారి కుటుంబ  సభ్యులకు పరిహారంగా రూ.4 లక్షలు అందజేస్తామని అసెంబ్లీలో తెలిపారు.


త్రిశ్శూర్‌లో అమానవీయ ఘటన

కేరళలోని త్రిశ్శూర్‌లో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనాపై భయంతో ఇద్దరు వృద్ధ దంపతులు ఇంట్లోనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండగా.. కొందరు వ్యక్తులు వారి ఇంటిని బయటి నుంచి తాళం వేయడం కలకలం సృష్టించింది. వారు ఆదివారం సౌదీ నుంచి కేరళకు తిరిగి వచ్చారు. విమానాశ్రయంలో నిర్వహించిన కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌లో వారికి నెగెటివ్‌గానే తేలింది. అయినప్పటికీ వారు తమ ఫ్లాట్‌లో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో వారు నివాసం ఉండే రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు వారి ఇంటిని బయటి నుంచి తాళం వేసి.. వారి తలుపునకు కరోనాకు సంబంధించిన స్టిక్కర్‌ అంటించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తూ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.


* ఇరాన్‌ నుంచి సోమవారం నాలుగో విడతగా మరో 53 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్వదేశానికి చేరుకున్న వారిని జైసల్మేర్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. 

* కరోనా వైరస్‌ గురించి తప్పుడు వార్తలను పోస్ట్‌ చేసినందుకు ఓ హెల్త్‌ వర్కర్‌ను రాజస్థాన్‌ జైపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని విధుల నుంచి తప్పించారు.

* ఒడిశాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఇటలీ నుంచి ఇటీవలే రాష్ట్రానికి చేరిన వ్యక్తి (33)కి ఈ వైరస్‌ సోకినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

* కరోనా వైరస్‌ కారణంగా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 26 వరకు వాయిదా పడ్డాయి. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి కొద్దిరోజులు ఊరట లభించింది.

* జమ్మూకశ్మీర్‌లోని అన్ని పార్కులు, గార్డెన్లు మూసివేయాలని అక్కడి అధికార యంత్రాంగం ఆదేశించింది. ఇటీవల సౌదీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు.

* పార్లమెంట్‌ కాంప్లెక్స్‌కు వచ్చే వారికి ఇవాల్టి నుంచి థర్మల్‌ స్క్రీనింగ్‌ ప్రారంభించారు. పార్లమెంట్‌ సిబ్బంది, జర్నలిస్టులకు స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. సాధారణ సందర్శకులకు అనుమతి ఇది వరకే నిరాకరించారు. 

* పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సైతం కుదించారు. మంగళవారం తర్వాత సమావేశాలు నిర్వహించకూడదని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

* ఈ నెల 31 వరకు స్కూళ్లు, కళాశాలలు మూసివేస్తున్నట్లు మేఘాలయ ప్రభుత్వం ప్రకటించింది.

ఇవీ చదవండి..

మేలుకో పౌరుడా! కరోనాపై బాధ్యత పెంచుకో!

మార్కెట్లకు మరో బ్లాక్‌ మండే..  

భారత్‌లో కరోనా బాధితుడి అనుభవమిది..!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.