మనుషులనే కాదు.. మానవత్వాన్నీ చంపేస్తోంది!

తాజా వార్తలు

Updated : 29/04/2021 07:10 IST

మనుషులనే కాదు.. మానవత్వాన్నీ చంపేస్తోంది!


పార్థివ దేహాన్ని చక్రాల బండిలో తరలిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, బాధిత యువకుడు

కటక్, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి పలువురిని పొట్టన పెట్టుకుంటోంది. మరోవైపు వైరస్‌తో మృతిచెందినవారి అంతిమ సంస్కారాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పటి వరకూ వరుసతో పిలిచిన బంధువులు, పేరు పెట్టి పిలిచిన స్నేహితులు ముఖం చాటేస్తున్నారు. రాష్ట్రంలో ఒకేరోజు జరిగిన రెండు ఘటనలు ఇందుకు నిదర్శనం. బొలంగీర్‌ జిల్లా బలిడుంగురి గ్రామంలో మంగళవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అయోధ్య సాహు (55) అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో చేర్చారు. అక్కడ కొవిడ్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం సాయంత్రం మృతి చెందింది. అయోధ్య అంత్యక్రియలకు బంధువులు, గ్రామస్థులెవరూ ముందుకు రాలేదు. చివరికి కుమారుడు తల్లి మృతదేహాన్ని పాలీథిన్‌ షీట్‌లో చుట్టి సైకిల్‌పై గ్రామ సమీపంలో ఉన్న అడవికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. దేవ్‌గఢ్‌ జిల్లాలోనూ మరో ఘటన చోటుచేసుకుంది. చంద్రశేఖర్‌ సాహు అనే వృద్ధుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఆరోగ్య సిబ్బంది కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచారు. మంగళవారం ఆయన మృతి చెందాడు. అంత్యక్రియలకు గ్రామస్థులు, బంధువులు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్‌ కైవల్యకరొ గ్రామస్థులు, బంధువులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఎవరూ వినలేదు. దీంతో కొన్ని గంటలపాటు మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. చివరకు పారిశుద్ధ్య సిబ్బంది, చంద్రశేఖర్‌ సాహు కుమారుడు దామోదర్‌ పీపీఈ కిట్లు ధరించి ఎడ్లబండిపై మృతదేహాన్ని శ్మశానానికి తరలించి దహనసంస్కారాలు నిర్వహించారు. 


 తల్లి మృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్తున్న కుమారుడు 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని