close
Array ( ) 1

తాజా వార్తలు

చిన్నపాటి తప్పు.. తప్పదు వైరస్‌ ముప్పు

సామాజిక దూరం పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం

ఇంటర్నెట్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినా ప్రజలు మాత్రం దీని తీవ్రతను గుర్తించడం లేదు. కొందరు బాధ్యతగా వ్యవహరించినా చాలామంది ఇష్టారాజ్యంగా వీధుల్లో తిరుగుతున్నారు. బయటకు వచ్చినా సరిగా సామాజిక దూరం పాటించడం లేదు. ప్రజలు గుంపులుగా ఉండొద్దని వైరస్‌ వ్యాప్తిపై ఎంత అవగాహన కల్పించినా ఇంకా భయం లేనట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. మాకు ఎందుకొస్తుందనే ధీమాలో ఉన్నారు. వీటికి సంబంధించిన చిత్రాలు మీ కోసం..


హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా చార్మినార్‌ సమీపంలోని వీధుల్లో తిరుగుతున్న వారితో గుంజీలు తీయిస్తున్న పోలీసులు


విజయవాడ చిట్టినగర్‌లో మోటారు సైకిల్‌పై నలుగురు ప్రయాణించడాన్ని ప్రశ్నిస్తున్న మహిళా పోలీసు. వాహనానికి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు.


రేషన్‌ దుకాణాలను ఏపీలో ఉదయం ఆరుగంటలకే తెరిచారు. సరుకులు తీసుకొనేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉదయం అందరూ సామాజిక దూరం పాటించి వరుసలో నిల్చున్నారు. మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువ కావడంతో వరుసలోని కుర్చీలు, బాక్స్‌లలో సంచులు పెట్టేసి నీడ ప్రదేశానికి వెళ్లారు. విశాఖ అక్కయ్యపాలెం మహారాణి పార్లర్‌ సమీపంలోని చౌకధరల దుకాణం వద్ద పరిస్థితిని ‘ఈనాడు’ తన కెమెరాలో బంధించింది. 


లాక్‌డౌన్‌ నిబంధనలు తమకు ఏమీ పట్టనట్లుగా ఒకే స్కూటీపై నలుగురు ప్రయాణిస్తున్న దృశ్యం. ట్యాంక్‌బండ్‌ వద్ద ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌మనిపించింది.


కర్నూలు నగరంలో ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు


లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు దిల్లీ-ఘజియాబాద్‌ సరిహద్దుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేసింది. బస్సులో ఖాళీ లేకపోవడంతో డోర్‌ను పట్టుకొని వెళ్తున్న కూలీలు.


గుంటూరు నల్లచెరువు ఒకటో వీధిలో రేషన్‌ దుకాణం ఎదుట కనిపించిందీ దృశ్యం. తొలుత సామాజిక దూరం పాటిస్తూ నిల్చున్న మహిళలు కొద్దిసేపటికి ఎండ వేడి పెరగడంతో వారు నిల్చున్న బాక్స్‌ల్లో చెప్పులు పెట్టి నీడన నిల్చున్నారు. 


గుంటూరు జీటీ రోడ్‌లోని మాంసం దుకాణం ఎదుట సామాజిక దూరాన్ని మరచి గుమికూడిన ప్రజలు. 


జనంతో రద్దీగా మారిన గుంటూరులోని చేపల మార్కెట్‌ వీధి.


కర్నూలు సీక్యాంప్‌ రైతుబజార్‌లో సామాజిక దూరం నియమాన్ని పాటించని ప్రజలు


కొనుగోలుదారులతో రద్దీగా మారిన నిజామాబాద్‌ హైమెదీ బజార్‌


ప్రకాశం జిల్లా ఒంగోలులోని చికెన్‌ దుకాణం ముందు కనీస దూరం పాటించకుండా బారులు తీరిన కొనుగోలుదారులు


గుంటూరు ఎత్తురోడ్డులో పెంపుడు కుక్కకు జర్వం రావడంతో దానిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రిక్షాపై కూర్చొబెట్టి, దుప్పటికప్పుతున్న యజమానురాలు. మార్గమధ్యలో పోలీసులు వేసిన బారికేడ్లను దాటుకొని చివరకు ఆస్పత్రికి తీసుకెళ్లారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.