ఫోన్‌ చేసిన 3 గంటల్లోనే పడక కేటాయించాలి: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 27/04/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫోన్‌ చేసిన 3 గంటల్లోనే పడక కేటాయించాలి: జగన్‌

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా  కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 104 కాల్‌సెంటర్‌ సమర్థంగా పనిచెయ్యాలని.. ఫోన్‌ చేసినవారికి తక్షణమే పరిష్కారం చూపాలని జగన్‌ ఆదేశించారు. 104కి ఫోన్‌ చేసిన 3 గంటల్లోనే పడక కేటాయించాలని పునరుద్ఘాటించారు. 104 కాల్‌సెంటర్‌కు వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కరోనా బాధితులకు ఉచితంగా మందులు ఇవ్వాలన్న సీఎం.. కొవిడ్‌ ఆస్పత్రులను జాయింట్‌ కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.

జిల్లా స్థాయిలో కరోనా ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి అన్నిచోట్లా పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడ ఖాళీలున్నా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయాలన్నారు. 48 గంటల్లో నియామకాలు పూర్తిచేయాలని నిర్దేశించారు. ప్రజలు గుమిగూడకుండా చూడాలని, వివాహాలకు 50 మందిని మాత్రమే అనుమతివ్వాలన్నారు. స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు, పార్కుల్లో అందరూ ఒకే చోట చేరకుండా చూడాలన్న ముఖ్యమంత్రి వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్షించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని