ఈ ఆస్పత్రి.. పేదల సంజీవని
close

తాజా వార్తలు

Published : 12/08/2020 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఆస్పత్రి.. పేదల సంజీవని

నెల్లూరు: వేల రూపాయలు దండుకునే ఆస్పత్రులున్న ఈ కాలంలో ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తోంది నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల. 67 ఏళ్లుగా ప్రజారోగ్యమే లక్ష్యంగా ఈ వైద్యశాల కృషి చేస్తోంది. ఇక్కడ 50మంది వైద్యులు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ భయపడకుండా చికిత్స అందిస్తున్నారు.

పేదవాడి ఊహకే అందని కార్పొరేట్‌ వైద్యాన్ని నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల అందిస్తోంది. అతి తక్కువ ఖర్చుకే పేదల వ్యాధులను నయం చేస్తోంది. కేవలం ఆస్పత్రి నిర్వహణకు అయ్యే డబ్బులు మాత్రమే తీసుకుంటోంది. అవి కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న నిరుపేదలకు మందులు కూడా ఉచితంగా అందిస్తోంది. 1953లో డా.రామచంద్రారెడ్డి నెల్లూరులో 5 పడకలతో చిన్న గుడిసెలో ప్రజావైద్యశాల ఏర్పాటు చేశారు. మద్రాసులో వైద్య వృత్తిని అభ్యసించిన ఆయన సామాన్యులకు అధునాతన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన లేనప్పటికీ వారసులు ఆయన ఆశయాన్ని కొనసాగిస్తున్నారు.

కార్పొరేట్‌లో పని చేసే వైద్యులు సేవాభావంతో ఇక్కడ ఉచితంగా పని చేస్తారు. 40ఏళ్లుగా సుమారు  30మంది వైద్యులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదాయం కన్నా సేవాభావం గొప్పదని వారు అంటున్నారు. 40 ఏళ్ల క్రితం వైద్యం అందుబాటులో లేని సమయం నుంచి నేటి వరకు గ్రామీణంలో ప్రాథమిక వైద్యం అందించేందుకు వైద్యులను తయారు చేస్తున్న ఘనత ఈ ఆసుపత్రిది. ఎంబీబీఎస్‌ చేసిన వైద్యులు సైతం ఇక్కడ శిక్షణ పొందడానికి ఆసక్తి చూపుతారు. గత మూడేళ్లలో 5వేల మంది వైద్యులు ఇక్క్డడ శిక్షణ పొంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజావైద్యశాలలను నడుపుతున్నారు. నెల్లూరు జిల్లాతో పాటు కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి కూడా  వైద్యం కోసం ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. నాటి నుంచి నేటి వరకు ఇక్కడి వైద్యులు లాభాపేక్ష లేకుండా సేవాభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని