TS News: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

తాజా వార్తలు

Published : 28/07/2021 21:38 IST

TS News: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌:  తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌ల నుంచి ప్రాణహాని ఉందని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ను ఆశ్రయించారు. శ్రీనివాస్ గౌడ్‌పై 2018 ఎన్నికల సమయంలో నమోదైన ఓ కేసు విషయంలో సాక్షిగా ఉన్న తమను కక్షగట్టిన మంత్రి, అతని సోదరుడు అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు విశ్వనాధ రావు, పుష్పాలత కమిషన్‌కు వివరించారు. మహబూబ్ నగర్ గ్రామీణ సీఐ మహేశ్వర్ తమ ఇంటిపై అర్ధరాత్రి దాడిచేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమను ఇదే విధంగా వేధిస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పేర్లను లేఖలో రాసి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా ప్రాణరక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధిత దంపతులు ఎచ్‌ఆర్‌సీని వేడుకున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని