
తాజా వార్తలు
పెళ్లి పత్రికల్లో క్యూఆర్ కోడ్!
ఇంటర్నెట్ డెస్క్: వివాహ వేడుకకు హాజరైన బంధువులు చదివింపులు జరపడం ఆనవాయితీ. వారికి తోచినంత నగదు రూపంలో లేదా బహుమతుల రూపంలో కొత్త జంటకు ఇస్తుంటారు. ఇది సాధారణంగా జరిగేదే. కానీ, ఓ జంట ఈ ఆనవాయితీని డిజిటల్‌గా మార్చేసింది. తమకు ఏవైనా నగదు ఇవ్వాలనుకుంటే డిజిటల్‌గా చెల్లించండంటూ తమ పత్రికల్లో క్యూఆర్ కోడ్లను ప్రింట్ చేయించింది.
తమిళనాడులోని మధురైకి చెందిన ఓ జంట ఇటీవల కుటుంబసభ్యులు, అతిథుల మధ్యలో ఒక్కటైంది. అయితే, ఈ వివాహానికి బంధువులు, అతిథులను ఆహ్వానించడం కోసం పెళ్లి పత్రికలు ప్రింట్ చేయించారు. అందులో జీపే, ఫోన్‌పే క్యూఆర్ కోడ్లను కూడా చేర్చారు. వివాహానికి హాజరైనా, కాకపోయినా తమకు కట్నాలు చదివించాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి నగదు పంపాలని కోరారు. వివాహం అనంతరం వివరాలు చూస్తే.. 30 మందికిపైగా అతిథులు ఈ డిజిటల్ పేమెంట్లు చేశారట.
Tags :