ఎమ్మార్వో మోసగించారని ఆత్మహత్యాయత్నం
close

తాజా వార్తలు

Updated : 27/02/2021 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమ్మార్వో మోసగించారని ఆత్మహత్యాయత్నం

 

అమరావతి: వెలగపూడిలోని ఏపీ సచివాలయం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా దుత్తలూరు తహసీల్దారు చంద్రశేఖర్ తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. చిట్టమూరు మండలం చిలమూరులో ఉన్న తమ పొలం ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు ఇప్పటి వరకూ రూ.కోటి ఇచ్చామని బాధితులు తెలిపారు. డబ్బులు ఇచ్చి ఏడాది గడుస్తున్నా తమ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని వాపోయారు. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. సచివాలయం వద్ద ఉన్న పోలీసులు అడ్డుకుని దంపతులను అదుపులోకి తీసుకున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని