
తాజా వార్తలు
మదనపల్లె హత్యలు: సబ్‌జైలుకు దంపతులు
మదనపల్లె: మూఢ భక్తితో ఇద్దరు కుమార్తెలను చంపుకొన్న చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన తల్లిదండ్రులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజను మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. అంతకుముందు వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించి మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
కొవిడ్ పరీక్షలు నిర్వహించే సమయంలో పద్మజ విచిత్రంగా ప్రవర్తించింది. తనకు కొవిడ్ పరీక్షలు చేయొద్దని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ‘‘నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?. నా గొంతులో హాలాహలం ఉంది’’ అంటూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఆసుపత్రిలోకి వచ్చేందుకు నిరాకరించింది. దీంతో పోలీసు వాహనం వద్దే ఆమెకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఇవీ చదవండి..
Tags :