మదనపల్లె ఘటన: తిరుపతి రుయాకు నిందితులు
close

తాజా వార్తలు

Updated : 30/01/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మదనపల్లె ఘటన: తిరుపతి రుయాకు నిందితులు

తిరుమతి: సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల క్రితం కన్న కూతుళ్లను మూఢభక్తితో హత్య చేసిన కేసులో నిందితులు పద్మజ, పురుషోత్తంనాయుడు 14 రోజుల రిమాండ్‌ నిమిత్తం మదనపల్లె సబ్‌ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, వారి మానసికస్థితి సరిగా లేనందున.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించాలని రెండు రోజుల క్రితం జైలు అధికారులకు వైద్యులు సూచించారు. కోర్టు అనుమతితో శుక్రవారం ఉదయం నిందితులను జైలు నుంచి చిత్తూరు ఏఆర్‌ సిబ్బంది భద్రత నడుమ తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఓపీ అనంతరం వారిద్దరినీ ఆస్పత్రిలోని సైకియాట్రీ వార్డుకు తరలించారు. నిందితుల ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ భారతి ఆరా తీశారు. పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిందితులకు వైద్యం అందించాలా లేక మరో చోటికి రిఫర్‌ చేయాలా అనే అంశాన్ని చెప్పగలమని ఆమె తెలిపారు.

ఇవీ చదవండి..

అందరితో కలిపి నన్నూ ఉంచండి

అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని