కోర్టుల తీర్పులు అనువాదం కావాలి:ఉపరాష్ట్రపతి
close

తాజా వార్తలు

Updated : 04/03/2021 13:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోర్టుల తీర్పులు అనువాదం కావాలి:ఉపరాష్ట్రపతి

తిరుపతి: ప్రతి ఒక్కరూ వీలైనన్ని భాషలు నేర్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం ‘ఐఐటీ తిరుపతి 6వ ఇన్‌స్టిట్యూట్‌ డే’ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘కొత్త ఆవిష్కరణలపై యువత దృష్టి సారించాలి. అన్ని పుస్తకాలు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావాలి. శాస్త్ర సాంకేతిక, వైద్య, న్యాయశాస్త్రాల బోధన ప్రాంతీయ భాషల్లోనే జరగాలి. ప్రాథమిక స్థాయి నుంచి బోధన మాతృభాషలోనే జరగాలి. ప్రభుత్వ పరిపాలన స్థానిక ప్రజల వాడుక భాషలో ఉండాలి. కోర్టుల్లో జరిగే వాదప్రతివాదనలు మాతృభాషలోనే జరగాలి. కోర్టులు ఇచ్చిన తీర్పులు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావాలి. ఆంగ్ల భాషకు నేను వ్యతిరేకం కాదు’’ అని అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఐఐటీ ప్రాంగణంలో మొక్క నాటారు. 

అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులకు ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, స్థానిక అధికారులు, తదితరులు ఘన స్వాగతం పలికారు.  
 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని