COVID-19: అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం
close

తాజా వార్తలు

Published : 05/05/2021 21:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

COVID-19: అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం

షాజహాన్‌పూర్: కరోనా మహమ్మారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోతే కనీసం అంత్యక్రియలు చేసేందుకు కూడా కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక పారిశుద్ధ్య సిబ్బంది మృతదేహాలను ఖననం చేస్తున్నారు. కొన్ని పరిస్థితుల్లో మానవతా వాదులు ముందుకు వచ్చి కుల, మత భేదాలు పక్కన పెట్టి అంత్యక్రియలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. కరోనా బాధపడుతూ చనిపోయిన 70ఏళ్ల వృద్ధురాలి మృతదేహానికి ఓ ముస్లిం వ్యక్తి మానవతా దృక్పథంతో అంత్యక్రియలు నిర్వహించాడు.

సునీత దేవి(70) వృద్ధాశ్రమంలో జీవిస్తుండగా, కరోనా బారిన పడింది.  దీంతో స్థానిక మెడికల్‌ కాలేజ్‌ ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఏప్రిల్‌ 5న జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆక్సిజన్‌ అందించారు. అక్కడే చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 29న ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు బంధువుల ఎవరూ ముందుకు రాలేదు. ఆరు రోజులుగా మార్చురీలోనే ఉంచారు. ఈ నేపథ్యంలో సునీత దేవి మరణవార్త తెలుసుకున్న మెరజుద్దీన్‌ ఖాన్‌ మానవతా దృక్పథంతో ఆమెకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ సాయంతో మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఖాన్‌ స్థానిక విలేకరిగా పనిచేస్తున్నారు. అంతేకాదు, సుదామదేవి(60) అనే మరో మహిళ అనారోగ్యంతో చనిపోగా, ఆమె అంత్యక్రియలకు కావాల్సిన డబ్బులను సుదామ కుమార్తెకు అందించి సాయం చేశారు. ఇలా కరోనా కష్ట కాలంలో పలువురు మానవతా వాదులు స్పందించి ఆదుకోవడంపై సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని